2, ఏప్రిల్ 2012, సోమవారం

CHINA-CONTD.=8

 
  
 మింగ్ చక్రవర్తులలో చివరి వాడైన 'చోంగ్జెన్ 'ఆత్మహత్య చేసుకొన్నాక 'మంచూ ' సైన్యం రాజధాని బీజింగ్ ని ఆక్రమించుకొన్నది.కాని,మిగతా చైనా సామ్రాజ్యాన్ని ,సరిహద్దులలోని అనేక తెగల,జాతుల రాజ్యాలను ఆక్రమించడానికి 40 సంవత్సరాలు పట్టింది.మింగ్ రజవంశీయులి,సైనికాధికారులు చాలా తిరుగుబాట్లు లేవదీశారు.కొందరు మంచూ పక్షం చేరారు.తిరుగుబాటు దార్లలో ముఖ్యులు 'లీజిచెంగ్ ' ,'జెంగ్ చెంగాంగ్ 'అనేవారు.తీవ్రమైన పోరాటాల తర్వాత,విపరీతమైన జననష్టం,రక్తపాతం,నగరాలవిధ్వంసం జరిగాక మంచూలు తిరుగుబాట్లన్ని అణచివేశారు.యునాన్ కొండప్రాంతం,ఫార్మోసా (నేటి తైవాన్ ) తో సహా చైనా అంతా వారి అధీనంలోకి వచ్చింది.జుంగారియా, సింకియాంగ్ వంటి సరిహద్దు ప్రాంతాలు కూడా ఏళ్ళ తరబడి పోరాటాల తర్వాత వారి వశమైనవి.ఇవి బీడునేలలు,ఎడారులు.ఐనా చైనా రక్షణకి అవసరమని వీటిని ఆక్రమించారు. చివరగా లామాల అంతహ్ కలహాలను ఉపెయోగించుకొని టిబెట్ని కూడా ఆక్రమించారు.కాని అక్కడ కొద్ది సైన్యాన్ని,అధికారులను మాత్రం ఉంచి ఉపసమ్హరించుకొన్నారు.
   మంచూ రాజులు లామాలని గౌరవించేవారు.వజ్రయాన బౌద్ధమతాన్ని అనుసరించేవారు. చాల బౌద్ధ ఆలయాలను కట్టించారు.క్రీ.శ.1620నుంచి,1820 వరకు 7గురు చక్రవర్తులు పాలించారు.అందులో ముగ్గురు బాగా ప్రసిద్ధులు.వీరు ముగ్గురు మొత్తం 100 ఏళ్ళు పాలించారు.వీరి పేర్లు వరసగా ,'కాంగ్ క్సీ ' ,యోంగ్జెంగ్ ,'క్వియన్లాంగ్ ' .యుద్ధభూమిలోనేగాక పరిపాలనలో కూడా సమర్థులే.అటు మంచూ,మంగోలు ,సంస్కృతులు,ఆచారాలతో బాటు ,ఇటు చైనా హాన్ జాతి సంస్కృతి, ఆచారాలను కూడా పాటించారు.బొద్ధమతాన్ని.కంఫూసియస్ నీతిని కూడా అనుసరించేరు.    సాహిత్యాన్ని,కళలను పోషించారు.ఈ కాలంలో చైనా వైశాల్యంలోనే గాక సిరిసంపదలలో కూడా ప్రముఖంగా ఉన్నట్లు విదేసీ యాత్రికుల వ్రాతల వలన తెలుస్తోంది.ప్రధానంగా సిల్కు వస్త్రాలని ,పింగాణీ వస్తువుల్ని ఎగుమతి చేసి ,నూలు వస్త్రాలను ,సుగంధద్రవ్యాలను దిగుమతి (మన దేశం,ఇండొనీసియా దీవులనుండి ) చెసుకొనేది .ఈ వ్యాపారాన్ని పోర్చుగెసు,డచ్ ,ఇంగ్లీషు వర్తకులు చేజిక్కంచుకొని బాగా లాభాలు పొందేవారు.
  ఐతే మంచూ రాజుల నిరంకుశత్వం చినా వారికి పడలేదు.ముక్ఖ్యంగా వారి ఆచారం అంటే మగవారందరూ తలవెంట్రుకలు ముందుభాగంలో గొరిగించుకొని ,వెనక జుత్తు జడ వేసుకోవాలని నిబంధన.కాని దీనిని ఇష్టం లేకపోయినా పాటించకతప్పలేదు.లేకపోతే కఠిన శిక్షలు పడేవి.మనం ఈ దృశ్యాలను చైనా కుంగ్ఫూ,కరాటే సినిమాల్లో చూడవచ్చును.
  చైనా చక్రవర్తులు విదేశీ రాయబార్లను లెక్క చేసే వారు కాదు.అప్పటి బ్రిటిష్ రాజు జార్జి 3 రాయబారితో కానుకలు పంపిస్తే ఇవన్నీ మాకు ఉన్నాయి ,అవసరం లేదని పంపించేసాడు.
     ఈ వంశాన్ని '  క్వింగ్ మంచు ' వంశం అంటారు.(మిగతా మరొక సారి)       

కామెంట్‌లు లేవు: