9, నవంబర్ 2013, శనివారం

Saastreeya sangeetam=4;kacheri




 శాస్త్రీయసంగీతం బాగా అభ్యసించిన తర్వాత కచేరీ (public concert) చేయనిదీ సాఫల్యం కలగదు.దీనికి సహజ ప్రతిభ,వ్యుత్పత్తి,శిక్షణ చాలా అవసరం.శ్రావ్యమైన కంఠస్వరం లేనిదే ఎంత విద్య వున్నా రాణించదు.అలాగే తగినంత శిక్షణ లేనిదే మంచి కంఠస్వరం వున్నా బాగుండదు.మనం ఎన్ని సీ.డీలు విన్నా ముఖతా(live) విన్న అనుభవం వేరు.
  సాధారణంగా కచెరీ ఈ విధంగా జరుగుతుంది.1.మొదట వినాయక స్తోత్రం తో ప్రారంభమౌతుంది. 2.నాటరాగంలోరచనతో ప్రారంభించడం ఒక సంప్రదాయం.3.తర్వాత కొన్ని వర్ణాలు,తర్వాత కృతులు ఒక్కొక్కటి 5 నుంచి 10 నిముషాలు సమయం తీసుకొని పాడతారు.3.ఆ తర్వాత ప్రధానమైన కృతి అరగంట నుంచి ఒక గంట వరకు కూడా సమయం తీసుకొని పాడతారు.( piece de resistance).ఇది ఈ విధంగా సంగీతంలోని అన్ని పార్శ్వాలను ప్రదర్ర్శిస్తూ  దాని పూర్ణ స్వరూపం తెలుసుకోడానికి పనికివస్తుంది. మొదట రాగాలాపన ,సాహిత్యం లేకుండా రాగంలోఉన్న విశిష్టతను మంద్ర,మధ్యమ,తారాస్థాయిలను స్పృశిస్తుంది. తర్వాత ' తానం ' (స్వరాలతోమాత్రం) పాడుతారు. ఆ పిమ్మట వరుసగా పల్లవి,అనుపల్లవి, చరణాలు  రిపీట్ చేస్తూ వివిధ గమకాలు,సంగతులతో(అంటే వివిధరీతుల్లో ) పాడతారు.మూడు కాలాల్లోను,మూడు స్థాయిల్లోను పాడవచ్చును.ముగించేముందు ప్రక్కవాయిద్యాలకి వయొలిన్,మృదంగం ,ఘటం లకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం,సమయం కల్పిస్తారు.4.తర్వాత మళ్ళీ కొన్ని కీర్తనలు వివరంగా పాదుతారు.5.చివరి దశలో జావళి,తిల్లాన వంటీనృత్యానికి అనువైన పాటలు పాడేక ,తేలికగా,అన్నమయ్య ,రామదాసు  వంటి  వారి కీర్తవలు,భజనలు పాడతారు.మొత్తం మీద కచేరీ దాదాపు 3 గంటలు సేపు కొనసాగవచ్చును.ఇటీవల వినేవారికి,పాడేవారికి ఓపిక తగ్గడంవలన కొంత  కుదిస్తున్నారు.5.కచేరీని ' మంగళం 'తోముగించడం సంప్రదాయం.
  పాడే వేగాన్ని బట్టి విలంబిత (slow) ,మధ్యమ (medium) ద్రుత (fast) అని మూడు రకాలు.
  పాడే స్థాయినిబట్టి (pitch) మంద్ర (low),మధ్య (medium),తార (high) స్తాయీ భేదం వుంటుంది.
  మనకన్నా ఉత్తరాదిలో  ఫలాన రాగం ఫలానా వేళలో,లేక ఫలానా రుతువులో పాడాలనే నియమముంది.అవి అప్పటి mood కి సరిపోతాయని వారి నమ్మకం.కొన్ని ఉదాహరణలు 1.భూపాలరాగం=ఉదయకాలంలో 2.మేఘమల్ హార్= వర్షాకాలం .3.దీపక్ రాగం=రాత్రిపూట.4.చక్రవాకం,సావేరి= ఆర్తిని,ఆవేదనని కలిగిస్తాయి.4.మోహన,కళ్యాణి,కాపీ రాగాలు=శృంగార ,ఆనంద భావాలు కలిగిస్తాయి. 5.కదనకుతూహల,దర్బారీకానడ రాగాలు = ఉత్సాహాన్ని,ఉద్వేగాన్ని కలిగిస్తాయి .marching songs  కి ,జాతీయగీతాలకి పనికివస్తాయి. (ఇంకా వుంది)    

కామెంట్‌లు లేవు: